10-08-2024 12:20:17 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లపై దాడులు చేస్తూ విస్తుపోయే విషయాలను బయటపెడుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు.. ప్రైవేట్ హాస్టళ్లపై దృష్టి సారించారు. శుక్రవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు గ్రేటర్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో ప్రైవేట్ హాస్టళ్లలో తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఎలాంటి పరిస్థితులు కనిపించాయో.. అచ్చంగా హాస్టళ్లలో అవే పరిస్థితులు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తనిఖీల్లో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. కోచింగ్ సెంటర్లు అత్యధికంగా ఉండే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్ పరిసరాల్లోని హాస్టళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు.. నాన్‌వెజ్‌వెజ్ ఒకే ఫ్రిజ్‌లో నిల్వ చేసి ఉండడాన్ని, హాస్టళ్ల కిచెన్లు, వాష్ ఏరియాలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గుర్తించారు.
ఆహార పదార్థాల తయారీలో రంగులతో కూడిన కెమికల్స్ వినియోగించడం, కాలం చెల్లిన, కుళ్లిన పదార్థాలను గమనించారు. వెంకటేశ్వర ఎగ్జిక్యూటివ్ పీజీ హాస్టల్ ఫర్ ఉమెన్ అండ్ గర్ల్స్, గ్రేస్ డీలక్స్ బాయ్స్ హాస్టల్, అభిశ్రయ్ బాయ్స్ హాస్టల్, అభిశ్రిత ఉమెన్ హాస్టల్, శ్రద్ధ ఎక్సెటెండ్ స్టే హాస్టల్, పద్మావతి పీజీ ప్రీమియం హాస్టల్, బాలాజీ బాయ్స్ హాస్టల్‌కు ఫుడ్ సరఫరా చేసే బాలాజీ దర్శన్ హోటళ్లలో తనిఖీలు చేపట్టినట్టు జీహెచ్‌ఎంసీ హెల్త్ విభాగం అడిషనల్ కమిషనర్ పంకజ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిజిగ్రేటెడ్ అధికారి ఎన్ సూర్య పర్యవేక్షణలో జరిగిన ఈ తనిఖీల్లో పలు లోపాలను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు హాస్టళ్ల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.
తనిఖీలో బయటపడిన విషయాలు..