calender_icon.png 11 November, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాక్షన్ అడ్వెంచర్ కామెడీ సిగ్మా

11-11-2025 01:35:17 AM

సందీప్ కిషన్ హీరోగా ఓ యాక్షన్ -అడ్వెంచర్ కామెడీ చిత్రం రూపొందుతోంది. జాసన్ సంజయ్ దర్శకత్వంలో సుబాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తాజాగా 95 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో టీమ్ హీరో ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ‘సిగ్మా’ అనే టైటిల్ ఖరారు చేశామని ప్రకటించారు. టైటిల్ పోస్టర్‌లో కథానాయకుడు సందీప్ కిషన్ యాక్షన్ అవతార్‌లో కనిపించారు. నియమాలకు అతీతమైన ధైర్యశాలి ప్రయాణమే ఈ సినిమా కథ అని టీమ్ పేర్కొంది.

తమిళం, తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో సందీప్ కిషన్ పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా అలరించనున్నారు. ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి, సుదర్శనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్; సినిమాటోగ్రఫీ: కృష్ణన్ వసంత్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్; ఆర్ట్: బెంజమిన్ ఎం.