10-08-2024 12:32:57 AM
13 కేజీల గంజాయి స్వాధీనం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): నగరంలో మాదకద్రవ్యాల నివారణే లక్ష్యంగా ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అడుగులు వేస్తోంది. శుక్రవారం హైదరాబాద్ నడిబొడ్డున 10.64 కేజీల గంజాయిని, ధూల్‌పేట్‌లో రెండు వేర్వేరు ఘటనల్లో 2.37 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కొంద రు ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు లిబర్టీ ప్రాంతంలోని ఆదర్శనగర్‌లో శిరీష అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ కేసుతో సంబంధమున్న అఫ్సర్ పాషా, కార్తీక్‌ను అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
అలాగే ధూల్‌పేట్‌లో రెండు వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో గంజాయి సరఫరా చేస్తున్న అర్జున్ సింగ్, లక్ష్మణ్‌సింగ్, నితీష్ సింగ్, అభిషేక్ సింగ్‌ను పట్టుకొని వారి నుంచి 2.37 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
నిందితులకు పదేళ్ల జైలు..
2015 సంవత్సరంలో 180 కేజీల గంజాయితో పట్టుబడిన ఇద్దరు నిందితులకు సం గారెడ్డి అడిషనల్ జడ్జి పదేళ్ల జైలు శిక్ష విధించారు. వివరాలిలా ఉన్నాయి.. నారాయణ ఖేడ్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీపేటలో 2015 మార్చి 9న ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా 180 కేజీల గంజాయితో ఇద్దరు వ్యక్తులు జాదవ్ బల రాం, జాదవ్ మారుతి పట్టుబడ్డారు. విచారణ పూర్తయిన నేపథ్యంలో సంగారెడ్డి కోర్టు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెల్లడించింది.