calender_icon.png 11 November, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లాసిక్ సినిమాలన్నిటికీ శివ కొత్త బాట వేస్తుంది

11-11-2025 01:36:21 AM

నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 1989లో విడుదలైన ‘శివ’ చిత్రానిది భారతీయ సినిమాలో ప్రత్యేక స్థానం. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మించారు. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఇయర్స్ సందర్భంగా ఈ చిత్రం సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 4కే డాల్బీ ఆట్మాస్ వెర్షన్‌లో నవంబర్ 14న థియేటర్లలో రీ రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా స్పెషల్ ప్రిమియర్ షో సోమవారం నిర్వహించారు.

అనంతరం ప్రెస్‌మీట్‌లో నాగార్జున, రామ్‌గోపాల్‌వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “శివ’కు ఇంత ఆదరణ ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. సౌండ్ అద్భుతంగా వినిపిస్తుందంటున్నారు. ఇదంతా రాము చేసిన ఎఫర్ట్. కొత్త సినిమా చూసినట్టుగా అనిపించింది. ప్రతి భాషలో మనకు ఎన్నో క్లాసిక్స్ ఉన్నాయి. అవన్నీ చూడాలనుకుంటున్నాం. వాటన్నిటికీ ‘శివ’ ఒక సరికొత్త బాట వేస్తుంది. దానికి కూడా రామునే ఆద్యుడుగా నిలుస్తాడని భావిస్తున్నా” అన్నారు.

రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. “శివ మేడ్ ఫర్ వన్ అండ్ ఓన్లీ నాగార్జున. ఒరిజినల్‌లో ఉండే ఫ్లేవర్ పోకుండా ఏఐ టెక్నాలజీని వాడి బెటర్ ఎఫెక్ట్ ఇవ్వడం కోసం ప్రయత్నించాం. అది అందరికీ నచ్చడం హ్యాపీగా ఉంది. సినిమాలో -సౌండ్ క్వాలిటీ బాగా పెరిగాక సాంగ్స్ స్లోడౌన్ చేస్తాయని రెండు సాంగ్స్ తీసేశాం. అప్పుడు సినిమాలో ఐదు పాటలుండాలనే ఫార్ములా ఉండేది. ఇప్పుడు ఛాన్స్ దొరికింది. తీసేశాం” అన్నారు.