calender_icon.png 11 November, 2025 | 3:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భర్త మహాశయులకు రామసత్యనారాయణ విజ్ఞప్తి

11-11-2025 01:37:24 AM

రవితేజ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి కథానాయికలు. ఇప్పటివరకు ‘ఆర్‌టీ76’ అనే మేకింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలోని ఒక పాటను ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో నాయకా, నాయికా ద్వయంపై చిత్రీకరిస్తున్నారు. 

 ఇదిలావుండగా, ఈ మూవీకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ ఖరారైందని మేకర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్ ఆద్యంతం అమితంగా ఆకట్టుకునేలా సాగింది. రవితేజ క్యారెక్టర్ మాట్లాడుతూ.. తనను రామ సత్యనారాయణగా పరిచయం చేసుకోవడం, టైటిల్ రివిల్ చేయడం ఆకర్షణీయంగా ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని మేకర్స్ ఇదే గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా, ప్రసాద్ మురెళ్ల సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా, ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నాయి.