calender_icon.png 1 May, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోదుస్తులు ఎలా ఉతకాలంటే!

27-04-2025 12:00:00 AM

చాలామంది ఎంతో ఖర్చు పెట్టి లోదుస్తులను కొంటారు కానీ వాటిని ఉతకడంలో కాస్త అశ్రద్ధ వహిస్తారు. దీంతో అవి త్వరగా పాడైపోవడంతో పాటు వాటివల్ల అనారోగ్యాలు దాడిచేసే అవకాశం ఉంది. దానికోసం కొన్ని టిప్స్ మీకోసం..

చాలామంది సాధారణ దుస్తులతో పాటు లోదుస్తులను కూడా వాషింగ్ మెషీన్‌లో వేస్తుంటారు. అయితే అది సరికాదు. లో దుస్తులను వీలైనంత వరకు విడిగా ఉతకడం మంచిది. 

లో దుస్తులు ఉతకడానికి ప్రత్యేకంగా వాషింగ్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వేసి వాషింగ్ మెషీన్‌లో వేయొచ్చు. విడిగా వాషింగ్ మెషీన్‌లో వెస్తే మాత్రం అవి సాగిపోయి త్వరగా పాడైపోతాయి. వీటిని గోరువెచ్చని నీటితో ఉతకాలి. మరీ వేడిగా ఉన్న నీటితో ఉతికితే వాటి ఎలాస్టిక్ పాడైపోతుంది.

ఉతికేముందు ఐదు నిమిషాలు నానబెడితే సరిపోతుంది. అలాగే ప్యాడెడ్ బ్రాలను ఉతికేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే వాటిలోపలి మెత్తటి ఫ్యాబ్రిక్ దెబ్బతింటుంది. లోదుస్తులను ఆరేసేటప్పుడు కూడా నేలపై పరిచినట్లు వేయడం వల్ల సాగిపోకుండా ఉంటాయి.