14-05-2025 12:44:04 AM
ఒడిశా నుంచి 11.825 కిలోల సరుకు తెచ్చిన నిందితుడు
రాజేంద్రనగర్, మే 13: శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు భారీగా ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 11.825 కిలోల సరుకును స్వాధీనం చేసుకొని నిందితుడిని అరెస్టు చేశారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ దేవేందర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్ డి పి ఎస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ రంగారెడ్డి దశరథ, డీఈపీఓ కృష్ణప్రియ ఆధ్వర్యంలో శంషాబాద్ ఎక్సైజ్ పోలీసు సిబ్బంది విశ్వసనీయ సమాచారం మేరకు పీవీఎన్‌ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నెంబర్ 240 సమీపంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు.
ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాకు చెందిన సుదీప్ కుమార్ ను అరెస్టు చేశారు. అతడి నుంచి 11.825 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తన స్వస్థలం నుంచి గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఎండు గంజాయిని కొనుగోలు చేసి రాజేంద్రనగర్, చింతల్ మెట్, ఆరంగర్ ప్రాంతాలలో ఇతరులకు విక్రయించేవాడని విచారణలో తేలింది. ఈ మేరకు నిందితుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ దేవేందర్ రావు తెలియజేశారు.