14-05-2025 12:42:52 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, మే 13 ( విజయక్రాంతి ) : రై తులు సేంద్రీయ వ్యవసాయం చేస్తూ భావి తరాలకు భూమిని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. జిల్లాలో ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి మంగళవా రం నాగవరం రైతు వేదికలో నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతు లతో మాట్లాడుతూ భూసారం తగ్గిపోయిందని, ప్రతి సంవత్సరం డి. ఏ.పి., యూరియా వంటి రసాయనిక ఎరువులు వాడుతూ పో తే అనతి కాలంలోనే భూమి నిస్సత్తువగా మారిపోయి భావితరాలకు పంటలు రాకుం డా చవట నేలగా మారిపోతుందన్నారు.
భా వితరాలకు సైతం భూమి ఉపయోగపడి పం టలు పండాలంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలని రైతులను కోరారు.పంట వేసే 45 రోజుల ముందు జీలుగా పచ్చ రొట్ట పెసర జనుము వంటి పంటలు సాగు చేసి వాటిని భూమిలో దుక్కడం వల్ల మంచి సేంద్రియ ఎరువుగా మారుతుందని తెలిపారు. దీనితో పాటు పశువుల ఎరువు వాడటం వల్ల అధిక దిగుబడి రావటమే కాకుండా భూమి సారవంతంగా మారుతుందన్నారు. జిల్లా వ్యవ సాయ శాఖ అధికారి గోవింద్ నాయక్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి విజయ భాస్కర్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ రమేష్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.