14-05-2025 12:45:00 AM
దూది వెంకటాపురం కొనుగోలు కేంద్రంలో వ్యాపారుల పై క్రిమినల్ కేసులు.
ఏఈవో సస్పెండ్
యాదాద్రి భువనగిరి మే 13 ( విజయ క్రాంతి ): యాదాద్రి భువనగిరి జిల్లా, రాజాపేట మండలం , దూది వెంకటపూర్ కొనుగోలు కేంద్రం (పీఏసీఎస్)లో, ధాన్యం వ్యాపారులు/ దళారులతో కుమ్మక్కై రైతులను మోసం చేసి అతి తక్కువ ధరకు కొనుగోలు చేసిన 400 క్వింటాళ్ల ధాన్యాన్ని రెవిన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నక్కీర్తి కనకరత్నం నక్కీర్తి లక్ష్మి, వస్పరి మహేష్ ఈ ముగ్గురు వ్యాపారులు దళారులతో కుమ్మక్కై అమాయకులైన చిన్న సన్నకారు రైతులనుండి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి పి పి సి కేంద్రంలో మద్దతు ధరకు అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు రాజాపేట ఎమ్మార్వో విచారణ జరిపి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.
అధికారిక చర్యలలో భాగంగా ఏ ఈ ఓ ని సస్పెండ్ చేసి దూది వెంకటపూర్ పిఎసిఎస్ సెంటర్ ఇంచార్జ్ ను విధులనుండి తొలగించారు. ఈ ఘటన తో జిల్లాలోని అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అప్రమత్తం చేస్తు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వ్యాపారులపై నిఘా ఉంచాలని అన్నారు.