24-12-2025 01:03:17 AM
ములుగు, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులు రెండు వందల సంవత్సరాల కాలం పాటు చెక్కుచెదరకుండా ఉండేలా అభివృద్ధి చేస్తున్నామ ని, అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం మం త్రి సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మహబూబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, డిఎఫ్‌ఓ రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి మేడారంలో శ్రీసమ్మక్క సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు.
అనంతరం మేడారంలోని హరిత హోటల్‌లో సంబంధిత శాఖల ఉన్నత స్థాయి అధికారులతో, గుత్తేదారులతో సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మం త్రి పొంగులేటి మాట్లాడుతూ.. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణ పను లు, రాతి నిర్మాణ పనులు, సివిల్ వర్క్స్, గద్దెల చుట్టూ గ్రిల్స్, ప్రాకారం బయటి వైపు సీసీ రోడ్లను పనులు డిసెంబర్ 31వ తేదీ లోపు, ఇతర పనులు జనవరి 5వ తేదీ లోపు పూర్తిచేయాలని ఆదేశించారు.
ప్రధాన ద్వారం పనులు కూడా జనవరి 5వ తేదీ లోపు పూర్తిచేయాలని సూచించారు. జాతర సమయంలో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత ప్రతిపాదికన వాటర్ ట్యాంకు లను నిర్మించాలని ఆదేశించారు. జాతరకు వచ్చే అన్ని రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని, ఐటిడిఏ ఆద్వర్యంలో తాత్కాలిక పనులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, శాశ్వత అభివృద్ధి పనులకే ప్రాధా న్యతకి ఇవ్వాలని, సుందరీకరణ కూడలిలో గ్రాస్ ప్లాంటేషన్ పనులు, రహదారికి ఇరువైపులా రెవెన్యూ ప్లాంటేషన్ మొక్కలను నాటించాలని అన్నా రు.
గిరిజన సాంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడే విధం గా గద్దెల ప్రాంతంలో పాలరాతి శిల్పాలచే పునరుద్ధరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, తక్కువ సమయంలో 100 శాతం పని చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వివరించారు.
అమ్మవార్లను దర్శించుకోవడానికి వచ్చే భక్తులను దేవాలయ ప్రాంగణ పునరుద్ధరణ పనులు ఎంతగానో ఆకట్టుకోనున్నాయని, నిస్వార్ధంగా దైవ కార్యక్రమా లను పూర్తి చేస్తున్నామని తెలిపారు. గద్దెల ప్రాంతాలలో విశాలమైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయడంతో రోడ్డు విస్తరణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయని, భక్తులకు ఇబ్బందులు కలగకుం డా 29 ఎకరాల భూసేకరణ చేపట్టి పనులు పూర్తి చేస్తున్నామని వివరించారు.
అస్తిత్వాన్ని కాపాడుతూ పనులు: సీతక్క
మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఆదివాసీ గిరిజనుల అస్తిత్వాన్ని కాపాడుతూ పనులను చేపట్టామని, పాల రాతి శిల్పాలు ఇతర ప్రాంతాల నుండి తీసుకురావడం కారణంగానే ఆలయ పునరుద్ధరణ పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయని తెలిపారు. పాలరాతి శిల్పాలపై గిరిజన సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా రూపొం దిస్తున్నామని, అమ్మవార్ల దయతో సకాలంలో పనులు పూర్తి అవుతాయని అభిప్రాయపడ్డారు. స్వస్తిక్ ఏర్పాటు విషయంలో గిరిజనుల సాంప్రదాయ ప్రకారంగా ఏర్పాటు చేస్తున్నామని దీనిపై ఎవరు రాద్ధాం తం చేయవద్దని కోరారు. పకృతి దైవాలుగా భావించి సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గొట్టు గోత్రాల ప్రకా రం పనులు చేస్తున్నామని తెలిపారు.