calender_icon.png 24 December, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చలిలో వణుకుతున్న కార్మికులు

24-12-2025 12:39:46 AM

గరం కోట్లు ఇవ్వని సింగరేణి

మంచిర్యాల, డిసెంబర్ ౨౩ (విజయక్రాం తి) : జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల తర్వాత సూర్యుడు కనిపిస్తుండగా, సాయంత్రం ఐదు గంటలకే చీకటి పడుతుంది. జిల్లా గరిష్ట(పగటి) ఉష్టోగ్రతలు 32 డిగ్రీలు నమోదవుతుండగా కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు 9.5 డిగ్రీల సెల్సియస్ కు పడిపోయాయి. శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల పరిధిలో భూగ ర్భ, ఓపెన్ కాస్టు బొగ్గు గనులుండగా కార్మికులు ప్రతి రోజు మూడు (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) షిప్టులలో విధులు నిర్వహిస్తుంటారు.

ఉదయం విధులకు హాజరయ్యే కార్మి కులు, మధ్యాహ్నం విధులు నిర్వహించి ఇంటి కి వచ్చే కార్మికులు చలితో ఇబ్బంది పడుతుండగా రాత్రి విధులు నిర్వహించే కార్మికులు విధులకు వెళ్లే సమయంలో, ఇంటికి వచ్చే సమయాల్లో చలికి ఇబ్బంది పడుతున్నారు. 

గరం కోట్లు ఇవ్వని సింగరేణి...

ప్రతి ఏడాది సింగరేణి కార్మికులకు ఇచ్చే గరం కోట్లు చలి మొదలైనప్పటికీ యాజమాన్యం ఇంత వరకు అందించడం లేదు. దీనితో సర్ఫేస్ లో పని చేసే ట్రామర్, హాలర్ ఆపరేటర్, మ్యాన్వే, ల్యాంప్ రూమ్, బిట్ షార్పనర్, మొదలగు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి కాలంలో గరం కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇంత వరకు అందజేయకపోవడంతో కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు.

చలి తీవ్రత మరింత పెరిగితే గైర్హాజరు శాతం పెరిగే అవకాశం లేకపోలేదు. సెక్యూరిటీ సిబ్బందికి వర్షా కాలంలో ఇవ్వాల్సిన వాన కోట్లను సింగరేణి యాజమాన్యం సరైన సమయంలో ఇవ్వకుండా వర్షా కాలం ముగిసిన తర్వాత ఇచ్చిందని, గరీం కోట్లు అయినా సమయానికి అందించాలని కార్మికులు కోరుతున్నారు. 

సరైన సమయంలో అందజేయాలి

చలి మొదలైనా సింగరేణి యాజమాన్యం ఇప్పటి వరకు కార్మికులకు గరీం కోట్లు ఇవ్వకపోవడం బాధాకరం. ప్రాతినిధ్య సంఘాలు నోరుమెదపక పోవడం కార్మికులపైన వారి ప్రేమకు నిదర్శనం. గనులపైన కార్మికుల సెల్ ఫోన్లు, వస్తువులు, హెల్మెట్ లు భద్రపరుచుకోవడానికి లాకర్లను ఏర్పాట్లు చేయాలి. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల సంక్షే మం పైన దృష్టి పెట్టాలి. గనులు పుట్టిన సమయంలో కార్మికుల రూములకు వేసిన వైట్ వాష్ వేశారు. సింగరేణి లెవల్ లో సేఫ్టీ వీక్ నడుస్తున్న సందర్భంగా ఈసారైనా అన్ని రూములకు వైట్ వాష్ వేసి క్లీనింగ్ చేపించాలి.

  గుల్ల బాలాజీ, సీఐటీయూ బ్రాంచ్ అధ్యక్షుడు, శ్రీరాంపూర్