24-12-2025 01:26:16 AM
ఆమనగల్లు, డిసెంబర్ 23(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పల్లెలో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని, పంచాయతీల అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తి నియోజకవర్గం లోని పలు మండలాలకు చెందిన ఇటీవల గెలుపొందిన వివిధ గ్రామాల సర్పంచులు, పాలకవర్గం, పార్టీ ముఖ్య నేతలు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గెలుపొంది పదవి బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్, పాలకవర్గం సభ్యులను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచ్,పాలకవర్గం సభ్యులకు ప్రస్తుతం పెద్ద బాధ్యత ఉందని గుర్తు చేశారు.
నూతన సర్పంచ్ లంతా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామంలోనెల కొన్న సమస్యలను పరిష్కరించి ప్రజల మనస్సులు దోచుకునేలా పాలన అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పిసిసి నేత సూదిని రామ్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బట్టు కిషన్ రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దేవయ్య వివిధ మండలాల నేతలు సర్పంచులు పాల్గొన్నారు.