calender_icon.png 24 December, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాస్త్ర సాంకేతిక నూతన పద్ధతుల ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేయాలి

24-12-2025 12:00:00 AM

అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి

పోలీస్‌స్టేషన్ రైటర్స్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

నిజామాబాద్, డిసెంబర్ (విజయక్రాంతి) : మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి  కాలానికి అనుగుణంగా వస్తున్న నూతన పద్ధతులను ఉపయోగిస్తూ వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న నేరాల నియంత్రణకు, కృషి చేయాలని నిజామాబాద్ అదనపు డిసిపి బస్వా రెడ్డి సిబ్బందికి సూచించారు. కేసులలో కొత్తదనం తీసుకువచ్చి కేసుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని  ఈ సందర్భంగా  సిబ్బందికి సూచనలు చేశారు.

మంగళవారం నిజామాబాదు పోలీస్ కమిషనర్ కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ హాలులో నిర్వహించిన స్టేషన్ రైటర్స్ శిక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని కేసుల పరిష్కారానికి విస్తృతంగా వాడాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా అదనపు డి.సి.పి  మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో గల కేసుల యొక్క పరిశోధనలో నాణ్యతను పెంచి ఎఫ్‌ఐఆర్ నుండి అంతిమ రిపోర్టు వరకు ఉండవలసిన మెలకువలు గురించి  ఎఫ్‌ఐఆర్ మొదలుకొని పంచనామా నేరస్తుల ఒప్పుకోలు పంచనామ స్టేట్మెంట్ రికార్డు చేయు విధానము తో పాటు గోపీయత పాటించాలని సిబ్బందిని ఆదేశిస్తూ పలు సూచనలు చేశారు.

కేసులకు సంబంధించిన విషయాలను క్షుణ్ణంగా శిక్షణ కార్యక్రమంలో ఆయన వివరించారు. నూతన చట్టాలపై అవగాహన కల్పించి జరిగినటువంటి నేరానికి, నేర స్థలానికి జత చేయడం విషయాలను నూతన టెక్నాలజీని వాడుకునే విషయంలో ఏ ఏ పద్ధతుల ద్వారా కేసు నాణ్యతను పెంచి నేరస్తులు చట్టం నుంచి తప్పించుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందిని కోరారు.  పాత కేసులకు సంబంధించి విచారణలో ఉన్నటువంటి విషయాలు తెలియపరచి అంతిమ రిపోర్టు కోర్టులలో సమర్పించే వరకు ఫారేన్ సిక్స్ సైన్స్ ను వాడుకునే విధివిధానాలను  కోర్టులో చార్జ్ షీట్ దాఖాలు చేసే విధివిధానాలను కూడా సిబ్బందికి బసవ రెడ్డి బోధించారు.

ఈ శిక్షణను మూడు రోజులపాటు నిర్వహిం చనున్నట్టు ఆయన తెలిపారు. తదుపరి స్టేషన్ రైట్స్ సంబంధిత పోలీస్ స్టేషన్లో వెళ్లిన తర్వాత తమ సిబ్బందికి  సంబంధిత అధికారికిఈ శిక్షణ కాలంలో నేర్చుకుంది సవివరంగా వివరించి తెలియజేయా చేయడంతో పాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేసులలో పట్టు సాధించే ఇలా కృషి చేయాలన్నారు.

సైబర్ క్రైమ్ లో భాగంగా నూతన సంత్సరం సందర్బంగా ఎలాంటి లింక్ లను ఓపెన్ చేయకూడదని, వాటిని ఓపెన్ చేస్తే మన బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బులు పూర్తిగా పోతాయి అని ముందస్తు గా ప్రజలకు తెలియజేయడంతో పాటు పలు సూచనలు చేశారు.ఎవరు కూడా తెలవని లింక్ ల ను వాట్సాప్ లలో తెరవద్దన్నారు.  ఈ కార్యక్రమంలో సైబర్ క్రైమ్ ఎ. సి. పి వెంకటేశ్వర్ రావు , టౌన్ సి ఐ  శ్రీనివాస్ రాజ్ తోపాటు ట్రైనింగ్ సి టి సి ఇన్స్పెక్టర్  వి. శివరామ్ , ఐటి కోర్ సిబ్బంది రైటర్లు తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.