calender_icon.png 29 January, 2026 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేనల్లుడి మోజులో భర్త హత్య

29-01-2026 01:19:19 AM

నల్లగొండ జిల్లా సీత్యతండాలో ఘటన

మిర్యాలగూడ(మాడుగులపల్లి), జనవరి 28: మేనల్లుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కాటికి పంపింది ఓ భార్య. ఈ ఘటన నల్లగొండ జిల్లాలోని మాడుగులపల్లి మండలం సీత్యతండాలో బుధవారం జరిగింది. సీత్యా తండాకు చెందిన రమావత్  రవి నాయక్, లక్ష్మి దంపతులు.

రవినాయక్ సోదరి కొడుకుతో లక్ష్మి గత నాలుగేళ్ల నుంచి వివాహేతర సంబంధం నెరుపుతున్నది. రవి పలుమార్లు హెచ్చరించినా తీరులో మార్పు రాలేదు. మంగళవారం రాత్రి ఇద్దరు మరోసారి గొడవ పడినట్టుగా తెలుస్తున్నది. ఈ క్రమంలోనే రవిని ప్రియుడితో కలిసి లక్ష్మి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. లక్ష్మి, ఆమె మేనల్లుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.