29-01-2026 01:21:02 AM
హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 116 మున్సిపల్, 7 కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి 26 వార్డులకు మొదటి రోజు 890 మంది అభ్యర్థులు 902 నామినేషన్లు దాఖలు చేశారు.
వీరిలో కాంగ్రెస్ పార్టీ నుంచి 382 మంది, బీఆర్‌ఎస్ నుంచి 208 మంది అభ్యర్థులు తను నామినేషన్లు దాఖలు చేశారు. ఇక బీజేపీ- 169, సీపీఎం - 6, బీఎస్సీ - 7, ఎంఐఎం- 3, ఆప్ నుంచి ఒకరు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు స్వతంత్రులు 55 మంది, వివిధ రిజిస్టర్ పార్టీలకు చెందిన 19 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.