26-12-2025 01:56:22 AM
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేశ్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్ టైన్‌మెంట్ పతాకంపై చిరంజీవి చెర్రీ, హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు. ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సిం ఘా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుపెడుతోంది. వెన్నెల కిషోర్, అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన దక్కింది. గురువారం క్రిస్మస్ సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి వెన్నెల కిషోర్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో వెన్నెల కిషోర్.. విమానం విండో సీట్ దగ్గర కూర్చుని కాన్ఫిడెంట్‌గా చూస్తున్న లుక్ ఆకట్టుకుంది. స్టైలిష్ హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకుంటున్న వెన్నెల కిషోర్ చేతిలో సినిమా సుడోకు బుక్ రితేశ్ రానా మార్క్ ఫన్‌ను జ్ఞప్తికి తెచ్చింది. ఈ సినిమాకు సంగీతం: కాలభైరవ; సినిమాటోగ్రఫీ: సురేశ్ సరంగం; యాక్షన్: వింగ్ చున్ అంజి; ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్; ప్రొడక్షన్ డిజైన్: నార్ని శ్రీనివాస్.