27-10-2024 12:00:00 AM
తన్మయ్ అజేయ సెంచరీ
హైదరాబాద్: రంజీ ట్రోఫీలో భాగంగా రెండు వరుస పరాజయాలతో డీలా పడిన హైదరాబాద్ సొంతగడ్డపై మాత్రం చెలరేగింది. ఎలైట్ గ్రూప్-బిలో పాండిచ్చేరితో మ్యాచ్‌లో హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో వికెట్ నష్టానికి 290 పరుగులు చేసింది. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (152 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగగా.. రోహిత్ రాయుడు (62 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.
మరో ఓపెనర్ అభిరత్ రెడ్డి (68) అర్థశతకం సాధించాడు. మిగిలిన మ్యాచ్‌ల విషయానికి వస్తే.. గ్రూప్-ఏలో బరోడాతో మ్యాచ్‌లో ఒడిశా 193 ఆలౌట్ కాగా.. డిఫెండింగ్ చాంపియన్ ముంబై తొలిరోజు ఆట ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. గ్రూప్-బిలో విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైంది. గ్రూప్-ఏలో జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు 71 పరుగులకే కుప్పకూలింది. నబీ, యుద్వీర్ సింగ్ చెరో 5 వికెట్లు పడగొట్టారు.