calender_icon.png 23 October, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

25 నుంచి మాదాపూర్‌లో హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్

23-10-2025 12:00:00 AM

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఫెస్టివల్ బ్రోచర్ ఆవిష్కరణ

ఖైరతాబాద్; అక్టోబర్ 22 (విజయక్రాంతి) : భారత్- జపాన్ మధ్య సాంస్కృతిక మార్పిడి, పరస్పర అవగాహన, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించే విధంగా  ఈ నెల 25, 26 తేదీలలో  హైదరాబాద్ మాదాపూర్ లోని  స్టేట్ గ్యాటరీ ఆఫ్ ఆరట్స్ లో 30వ హైదరాబాద్ జపాన్ ఫెస్టివల్‌ను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. నారా జపాన్ హబ్(ఎన్ ఆర్ జె హచ్) ఆధ్వర్యంలో జరిగే ఈ ఫెస్టివల్ కు సంబంధించిన బ్రోచర్ ను బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ జపనీస్ అసోసియేషన్ చైర్మన్ హెచ్. ఫురుటా మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, జపాన్ యాక్టింగ్ కాన్సుల్ జనరల్ (చెన్నై) మియాట కెంజీ తదితర ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. ఈ ఫెస్టివల్ తో ఇక్కడి జపనీస్ కుటుంబాలకు వారి సంస్కృతి, సంప్రదాయాలను పంచుకోవడానికి అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుందని తెలిపారు.

అనంతరం ఎన్ ఆర్ జె హెచ్ వ్యవస్థాపకులు  బోడుపల్లి రామభద్ర, బొడ్డుపల్లి నాగనాథ్ లు మాట్లాడుతూ.. ఈ ఫెస్టివల్ రెండు దేశాల మధ్య విస్తరిస్తున్న స్నేహానికి నిదర్శనంగా నిలుస్తుందని తెలిపారు.ప్రజలకు ఉచిత ప్రవేశంతో పాటు, జపనీస్-భారతీయ సంప్రదాయాల ప్రత్యేక కలయికను అనుభవించాలని  ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు.