27-08-2025 12:17:12 AM
ఘట్‌కేసర్, ఆగస్టు 26 : హైదరాబాద్ శివారు పోచారం మున్సిపల్ పరిధిలోని సాదత్‌అలిగూడలో మంగళవారం రోడ్డుపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిం చారు. కాచవాని సింగారం సర్వే 715లో రెండు ఎకరాల భూమిలో చౌదరిగుడ మాజీ సర్పంచ్ నక్క నరసింహ 40 ప్లాట్లు వెంచర్ చేశాడు. ఆ వెంచర్‌లో పవన్ కళ్యాణ్ 178, శంకర్ 173, దేవరాజు -179 నెంబర్ గల ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే నక్క నరసింహ తాను చేసిన వెంచర్‌లో రోడ్డును కబ్జా చేసి ప్లాట్ల యజమానులను ఇబ్బందులకు గురి చేయడంతో బాధితులు హైడ్రాను ఆశ్రయించారు.
రికార్డులను పరిశీలించిన తర్వాత మంగళవారం హైడ్రా ఆఫీసర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది వెంచర్ లో అక్రమంగా నిర్మించిన ప్రహరీ కూల్చివేసి 20 ఫీట్ల రోడ్డును వినియోగంలోకి తీసుకువచ్చారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి సమస్యను పరిష్కరించినందుకు హైడ్రా అధికారులకు బాధితులు కృతజ్ఞతలు తెలియజేశారు.