calender_icon.png 27 August, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రంథాలయాల అభివృద్ధికి ప్రత్యేక కృషి

27-08-2025 12:18:04 AM

బోథ్ గ్రంథాలయాన్ని సందర్శించిన చైర్మన్ నర్సయ్య

బోథ్, ఆగస్టు 26 (విజయక్రాంతి): జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తనవంతు గా ప్రత్యేక కృషి చేస్తానని గ్రంథాలయ నూతన చైర్మన్‌గా నియమితులైన మల్లెపూల నర్సయ్య పేర్కొన్నారు. బోథ్ మండల కేం ద్రంలోని పురాతన గ్రంథాలయానికి రూ. 50 లక్షల నిధులు మంజూరు చేసి దాని అభివృద్ధికి కృషి చేస్తానని చైర్మన్ వెల్లడించారు.

మంగళవారం బోథ్ గ్రంథాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. గ్రంథాలయంలో ఉన్న బుక్స్ ను, వార పత్రికలు, వార్తా పత్రికలను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్‌లను పాఠకు లకు గల సౌకర్యాలపై పర్యవేక్షించారు. అంత కు ముందు  గ్రంథాలయ చైర్మన్‌గా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా బోథ్ పట్టణానికి రావడంతో నర్సయ్యను కాంగ్రెస్ నాయకు లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గొర్ల రాజు, నాయకులు భోజన్న, గంగాధర్, సురేందర్, గంగయ్య, అంజయ్య, షేక్ నాజర్ తదితరులు పాల్గొన్నారు.