calender_icon.png 10 September, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాకవి కాళోజీకి హైడ్రా నివాళి

10-09-2025 01:35:48 AM

కాళోజీ చిత్రపటానికి నివాళి అర్పించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్, సిటీ బ్యూరో సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): పద్మవిభూషణ్, ప్రజాకవి, స్వర్గీయ కాళోజీ నారాయణ రావు గారి 111 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి  పూలమాలలు వేసి హైడ్రా కమిషనర్  ఏవీ రంగనాథ్ నివాళులర్పించారు.

అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు జీవించారని హైడ్రా కమిషనర్ ఈ సందర్భంగా అన్నారు.

పుట్టుక నీది,చావు నీది, బ్రతుకంతా దేశానిది అన్న వారి మాటలు అందరికీ స్పూర్తి కావాలని ఆకాంక్షించారు. హైడ్రా అడ్మిన్ ఎస్పీ  సుదర్శన్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కాళోజీ గారికి నివాళులర్పించారు.