10-09-2025 01:33:52 AM
వ్యవస్థాపక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ గుప్తా
ముషీరాబాద్, సెప్టెంబర్ 9(విజయక్రాంతి): వైశ్యుల ఆత్మగౌరవం, హక్కుల సాధనకై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైశ్యుల రాజకీయ వాటా తేల్చాలని వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే సాధన దీక్ష కార్యక్రమానికి రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు,మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్, ముక్కా సాంబశివ రావు రాష్ట్రంలోని మన జిల్లాలకు చెందిన వైశ్యులు భారీ ఎత్తున హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ వైశ్యులు పేరుకే అగ్ర వర్ణాలుగా సమాజంలో కీర్తింపబడుతున్నారని, కానీ రాజకీయంలో అస్పృచులుగా మిగిలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వైశ్యుల జనాభా దామాషా ప్రకారం 500 సర్పంచులు, 250 ఎంపీటీసీ, 30 ఎంపీపీ, 30 జెడ్పిటిసి, 200 కౌన్సిలర్లు, 40 కార్పొరేటరులు,
కనీసం ఒక జడ్పీ చైర్మన్, ఒక మేయర్, 15 మున్సిపల్ చైర్మన్ స్థానాలకు అవకాశం కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాచం సుష్మా, నంగునూరు రమేష్, రామ్ నరేష్, కొత్త రవి, కాచం ఏక్ సాయి, కోడుమూరు దయాకర్, శేఖర్, గిరీష్, బొక్క ఈశ్వరయ్య, సంగం నాయకులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.