calender_icon.png 7 November, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్కెట్‌లోకి హ్యుండై సరికొత్త వెన్యూ కారు

07-11-2025 12:00:00 AM

ప్రకాష్ షోరూంలో విడుదల చేసిన ఎండి దినేష్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 6 (విజయక్రాంతి): హైదరాబాద్‌ని ప్రకాష్ హ్యుండై షోరూంలో గురువారం షోరూం ఎండి నల్ల దినేష్‌రెడ్డి సరికొత్త వెన్యూ కారు ను ఆవిష్కరించారు. షోరూం సీఈఓ నల్ల ప్రతిహాస్‌రెడ్డి మాట్లాడుతూ.. “హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త హ్యుందాయ్ వెన్యూ కారుని  ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేయడంతో ఒక ముఖ్య మైన మైలురాయిని సాధించిందన్నారు. కాం పాక్ట్ ఎస్‌యూవీ విభాగాన్ని బోల్ కొత్త డిజైన్, అధునాతన సాంకేతికతతో రూపొందించిందన్నారు.

ఇది గేమ్-ఛేంజర్ అని, ఆల్-న్యూ హ్యుందాయ్ వెన్యూ, ప్రతి డ్రైవ్‌ను స్మార్గ్, సురక్షితంగా చేయాలనే  అనుభవాలను కోరుకునే వారి కోసం రూపొందిం చబడిందన్నారు. ఇది హ్యుం దాయ్ అత్యాధునిక పూణే తయారీ కర్మాగారం నుంచి విడుదలైన మొదటి ఉత్పత్తి అన్నారు. 2030 నాటికి హ్యుందాయ్ ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్న 26 ఉత్పత్తులలో మొదటిది అని చెప్పారు.

ఇది ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’లో ఒక ముందడుగు. ఎన్‌వీఐడీఐఏ ద్వారా వేగవంతం చేయబడిన సీసీఎన్‌సీ ప్రారంభంతో, సరికొత్త ప్రపంచాన్ని చేతివేళ్ల వద్ద ఉంచే అద్భుతమైన 31.24 సీఎం (12.3) సీసీఎన్‌సీ నావిగేషన్ సిస్టమ్‌తో వస్తుంది. హెచ్‌ఎక్స్2 ప్రారంభ ధర రూ.7,89,900గా, హెచ్‌ఎక్స్ మోడల్ ధర రూ.8,79,900, హెచ్‌ఎక్స్ మోడల్ ధర రూ.9,14,900 గా ఉందని తెలిపారు. మొదటి కారును డాక్టర్ లక్ష్మణ్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో షోరూ జిఎం వినోద్,  నితిన్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.