07-11-2025 12:00:00 AM
-పలు కీలక రికార్డులు చోరీ
-ఫర్నిచర్ ధ్వంసం
యాదగిరిగుట్ట (విజయ క్రాంతి): యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయంలో బుధ వారం దొంగతనం జరిగింది. మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి పలు కీలక రికార్డులు చోరీకి గురైనట్టు తెలుస్తుంది. రికార్డులను ఎత్తుకెళ్లాల్సిన అవసరం దొంగలకు ఏముంటుంది ఇది ఇంటి దొంగల పనా లేక ఇంకేదైనా అనే అనుమానాలకు దారి తీస్తుం ది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో మొదటినుంచి ఒక రకమైన రాజకీయ ఎత్తుగడలు జరుగుతూనే ఉన్నాయి.
కాంగ్రెస్ యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పీఠాన్ని మెజారిటీతో కైవసం చేసుకున్న ప్రమాణస్వీకారం రోజు ఎవరు ఊహించని విధంగా ఎక్స్ అఫీషియో విధానంలో కడియం శ్రీహరి , అప్పటి ప్రభుత్వ పెద్దలు ఎక్స్ అఫీషియో ఓటు విధానం ద్వారా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారిని మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. అప్పుడు అధికారికపరంగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు ఎలాగైనా తిరిగి మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
ఊహించని విధంగా బిఆర్‌ఎస్ పార్టీలో ఉన్న చైర్మన్ ని పదవి నుంచి తప్పించే ప్రయత్నాలు చేసిందని చైర్మన్ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ప్రస్తుత ఎమ్మెల్యే గెలుపుకు తన వంతు కృషి చేశాడు. ఈ విధంగా చైర్మన్ పార్టీ మారడం కీలకంగా వ్యవహరించడం రాజకీయంగా బలంగా ఎదగడం జరిగింది. ఇదిలా ఉంటే మున్సిపల్ లో రికార్డులు దొంగతనం జరగడం మరియు పర్మిషన్ ధ్వంసం కావడం దీని వెనుక ఎవరు హస్తం ఉందనేది పెద్ద ప్రశ్న ఏది ఏమైనా పూర్తి వివరాలు బయటకు రావడానికి సమయం పడుతుంది. ఇంటి దొంగల పనా లేక ఇతరుల హస్తం ఉందా అనే సందిగ్ధంలో ప్రజలు ఉన్నారు.