calender_icon.png 29 May, 2025 | 3:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేనొక బ్లూ ప్రింట్!

28-05-2025 01:12:15 AM

ఇటీవల కేన్స్ ఫెస్టివల్‌లో భారతీయ చిత్రసీమలోని పలువురు నటీమణులు సందడి చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా సైతం ఈ వేడుకల్లో విభిన్న దుస్తులు ధరించి రెడ్ కార్పెట్‌పై హొయలుపోయింది. అయితే ఈ వేడుకలో ఊర్వశీ తీరుపై విమర్శలు వచ్చాయి. ఇదే వేడుకల్లో పాల్గొన్న ఐశ్వర్యరాయ్‌తో కొందరు పోల్చడం తనకు  నచ్చలేదని చెబుతోంది ఊర్వశి.

నెటిజన్స్ కామెంట్స్‌పై ఆమె స్పందించింది. “నేను సా సొంత చరిష్మాతో ఐశ్వర్యరాయ్‌గా ఉండటానికి ప్రయత్నిస్తున్నా. ఎందుకంటే డార్లింగ్ ఐశ్వర్య ఓ ఐకానిక్. కానీ, నేను మరొకరిలా నకిలీగా ఉండటానికి ఇక్కడికి రాలేదు. ఎందుకంటే నేనొక బ్లూప్రింట్. కేన్స్ ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా నిలబడటానికే వచ్చా. నా లుక్, స్టుల్, నా విశ్వాసం మీకు అసౌకర్యంగా అనిపిస్తే గట్టిగా ఓ శ్వాస తీసుకోండి.

నేను అందరికీ వ్యక్తిని కాదు. నేనెప్పుడూ బాణసంచాలాగా, షాంషైన్‌లాగా ఉంటా. నా మీద ఎన్ని విమర్శలొచ్చినా ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటా” అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో రాసుకొచ్చింది. అంతేకాకుండా కేన్స్ ఫెస్టివల్‌లో తన ఫొటో షూట్ కోసం మెట్లను బ్లాక్ చేయడం ద్వారా ఇతరులకు ఇబ్బందులు కలిగించారంటూ వచ్చిన విమర్శలపైనా ఊర్వశీ ఈ సందర్భంగా స్పందించింది.

అలాంటిదేమీ జరగలేదని, తాను ముందే అనుమతి తీసుకున్నానని తెలిపింది. తనకు కేన్స్ ఫెస్టివల్‌లో నిబంధనలన్నీ తెలుసు అని, ఎక్కడా అతిక్రమించలేదని చెప్పింది.