28-05-2025 01:10:58 AM
రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం మంగళవారం కనుల పండువగా జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పలు రంగాల్లో విశేష సేవలందించిన పలువురికి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు. మొదటి విడత అవార్డులను అందుకున్నవారిలో తెలుగు చిత్రసీమ నుంచి నందమూరి బాలకృష్ణ ఉన్నారు.
తాజాగా మరికొందరికి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సినీనటి డాక్టర్ శోభన చంద్రకుమార్‌తో పాటు కన్నడ నటుడు అనంత్ నాగ్ పద్మభూషణ్ అందుకున్నారు. శో భన కళారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ పద్మభూషణ్ అవార్డును అందజేశారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు ఐకాన్‌గా ఉన్న డాక్టర్ శోభన ఆరు భారతీయ భాషల్లో 230కిపైగా చలనచిత్రాల్లో నటించారు. ఆమె తన భరతనాట్యం ద్వారా సినిమాలకు మరింత వన్నె తెచ్చారు.