calender_icon.png 2 July, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా

02-07-2025 12:13:49 AM

- పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

- కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి

కామారెడ్డి, జూలై 1(విజయ క్రాంతి), ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టు కుంటున్నట్లు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి తెలిపారు. మంగళవారం కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి, షాబ్దీపూర్, రామేశ్వర్ పల్లి, గర్గుల్, తదితర గ్రామాల్లో పర్యటించారు. ఆయా గ్రామాల కుల సంఘాలు, యువజన సంఘాలు పిలుపుమేరకు గ్రామాలలో ఎన్ని పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులను ఎమ్మెల్యే కోరారు. పలు ప్రారంభోత్సవాలు, పలు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మండల బిజెపి నాయకులు పాల్గొన్నారు.