calender_icon.png 30 August, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను పార్టీకి కాదు.. మునుగోడు ప్రజలందరికీ ఎమ్మెల్యేను..

30-08-2025 12:56:56 AM

చౌటుప్పల్, ఆగస్టు 29(విజయ క్రాంతి): మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లోని వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో   ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  కలిసిన ఆర్ ఆర్ ఆర్ బాధిత రైతులు .అనంతరం  రాజగోపాల్ రెడ్డి  మాట్లాడుతూ గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం, బిఆర్‌ఎస్ నాయకులు పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మక్కై ఆర్‌ఆర్‌ఆర్ అలైన్మెంట్ ను మార్చి   ఏం తెలియనట్లు మీతో కలిసి ధర్నాలు చేయిస్తున్నారు.

మీకు నాయ్యం జరిగి  మంచి రేటు ఇపించే ప్రయత్నం  చేస్తాను. అలాగే ఆర్‌ఆర్‌ఆర్ భూముల సేకరణ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందని  అధికారులను అడిగి  తెలుసుకొని కొన్ని  రోజుల వరకు తాత్కాలికంగా ప్రాసెస్ ను ఆపండని అధికారులను అన్నాడు.మరొ సారి అలైన్ మెంట్  గురించి అధికారులుతో చర్చించిరేపు జరిగే అసెంబ్లీలో ముఖ్య మంత్రి తో మాట్లాడి మీ సమస్యను తెలియజేస్తానని నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడిని  రైతుల బాధ నాకు తెలుసు అని  అన్నాడు.