07-11-2025 12:11:48 AM
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ స్క్రీన్‌ప్లే అందించారు. ఈ సినిమా ఈ నెల 14న థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ఈవెంట్‌కు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ అతిథులుగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. “లివ్ ఇన్ రిలేషన్, పెళ్లి సులువు అయ్యింది. కానీ పిల్లలు పుట్టడమే సమస్యగా మారుతోంది. ఈ సినిమా తీయడం కంటే మార్నింగ్ షోస్‌కు ప్రేక్షకుల్ని రప్పించి సినిమా సక్సెస్ అనిపించుకోవడం గొప్ప విషయం. దానికోసం ఎక్కువ శ్రమ పడాలి” అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. “సంతాన ప్రాప్తిరస్తు’ ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆకట్టుకుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్” అని చెప్పారు. చిత్ర కథానాయకుడు విక్రాంత్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్ ఉన్నాయి. ఒక మంచి మెసేజ్ కూడా ఉంది” అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ.. “సొసైటీలోని మేల్ ఫెర్టిలిటీ ఇష్యూను తీసుకుని ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఎక్కడా హద్దు దాటకుండా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు” అని తెలిపింది. డైరెక్టర్ సంజీవ్‌రెడ్డి మాట్లాడుతూ.. “సంతాన ప్రాప్తిరస్తు’ ఒక ఫ్యూర్ లవ్‌స్టోరీ. ఈ కథకు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఒక చిన్న సోషల్ ఇష్యూను కూడా జతచేసి రూపొందించాం” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్లు నిర్వి హరిప్రసాద్‌రెడ్డి, మధుర శ్రీధర్‌రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ, స్క్రీన్‌ప్లే రైటర్ షేక్ దావూద్, డైలాగ్ రైటర్ కల్యాణ్ రాఘవ్ మాట్లాడారు.