16-12-2024 12:48:19 AM
కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, డిసెంబరు 15 (విజయక్రాం తి): బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో తాను లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటించారు. ఆదివారం ఆ యన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడు తూ.. బీజేపీలో పోలింగ్‌బూత్ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్ష నియామకం వరకు సమిష్టి నిర్ణయాల మేరకే జరుగుతాయన్నా రు.
సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయని, ఇంకా జిల్లా, రాష్ట అధ్యక్ష నియామకాల అం శం చర్చకు రాలేదన్నారు. తనపై అభిమానం తో కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. తన కు హోంశాఖ సహాయ మంత్రిగా పెద్ద బాధ్యతలు అప్పగించిందని.. సమర్థవంతంగా నిర్వ ర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని, అధ్యక్ష రేసు ప్రచారమంతా ఊహాగానాలేనన్నారు.