calender_icon.png 16 September, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విలాసవంతమైన ఫ్యాషన్.. అద్యాయే

16-12-2024 12:44:46 AM

బంజారాహిల్స్ రోడ్ నెం.10లో నూతన స్టోర్ ప్రారంభం

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): ఆధునిక తరానికి విలాసవంతమైన పాంపరిక ఫ్యాషన్‌ను అన్వేషిం చిందేకు ‘అద్యాయే’ను సందర్శించాలని హౌస్ ఆఫ్ గావిన్స్ స్థాపకులు నరేశ్, చందేశ్, రితేశ్ జైన్ తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో హౌస్ ఆఫ్ గావిన్స్ సంస్థ ‘అద్యాయే’ పేరుతో నూతన పాంపరిక ఫ్యాషన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా స్థాపకులు మాట్లాడుతూ.. గావిన్స్ విస్తరణలో భాగంగా అద్యాయే భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ఆధునిక శైలితో కలిపి పురుషులు, మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకమైన వస్త్రాలను అందిస్తోందని అన్నారు.

ఈ స్టోర్ నాలుగు అంతస్తుల్లో విస్తరించి ఉందని, చేతితో నేసిన చీరలు, అందమైన లెహంగాలు, నాజూకైన షేర్వానీల వంటి శ్రావ్యమైన వస్త్రాలు ఇక్కడ లభిస్తాయని తెలిపారు. ప్రతీ వస్త్రం నైపు ణ్యం కలిగిన కృషి, శాశ్వతమైన డిజైన్‌ను ప్రతిబింబిస్తోందని చెప్పారు. “ఏక్ పరివార్, ఏక్ పరంపరా, సబ్కీ అనోఖీ కహానీ’ అనే థీమ్ ఆధారంగా, ఈ స్టోర్ కుటుంబం, సంప్రదాయం, ఆధునిక శైలిని ప్రదర్శిస్తుందని.. ‘అద్యాయే’ తమ వారసత్వం పట్ల ప్రేమను, ఆవిష్కరణను ప్రతిబింబిస్తోందని తెలిపారు.