20-06-2024 12:00:00 AM
సీనియర్ కథానాయిక అనుష్క శెట్టికి ఉన్న క్రేజీ గురించి ప్రత్కేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి పాపులారిటీ సాధించిందీ బ్యూటీ. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఈ అమ్మడు ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా, అనుష్క ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతం గురించి ఓ విషయాన్ని వెల్లడించింది. ‘ఒక్కసారి నవ్వటం ప్రారంభిస్తే చాలా సేపు ఆపకుండా నవ్వుతూనే ఉంటాను. ఎవరైనా జోక్ చేస్తే చాలు పగలబడి నవ్వేస్తాను.
ఇలాంటి అలవాటు వల్ల సినిమాల షూటింగ్ సమయంలోనూ చాలా ఇబ్బంది పడ్డాను’ అని వివరించింది అనుష్క. అయితే, నవ్వటం ఆరోగ్య సమస్య ఎలా అవుతుంది అని అడిగితే అసలు విషయం చెప్పిందీ భామ. ‘సాధారణంగా ఏదైనా జోక్ వింటే అందరూ కాసేపు నవ్వి ఊరుకుంటారు. నేను అందరిలా కాదు. నాకు చాలా త్వరగా నవ్వొస్తుంది. ఇది కూడా ఓ వ్యాధిలాంటిదే కదా’ అంటూ మళ్లీ స్వీట్‌గా నవ్విందీ స్వీటీ. నిరుడు దర్శకుడు మహేశ్ బాబు తెరకెక్కించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’లో చివరి సారి కనిపించింది.
చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన 19 ఏండ్ల తర్వాత ‘కథానర్’ సినిమాతో అనుష్క మలయాళ ఇండస్ట్రీలోకి ఇవ్వబోతోంది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తీయనున్న చిత్రం ‘ఘాటి’కి సైతం కమిట్ అయ్యింది. ఈ చిత్రంలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌తో ఆకట్టుకోనుందట ఈ స్వీటీ.