calender_icon.png 18 November, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మాయా సుందరి’ ధ్యాసలో..

21-06-2024 12:05:00 AM

చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా ‘ధూంధాం’. సాయికుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తెరకెక్కిస్తున్నారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ పతాకంపై ఎంఎస్ రామ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే సహకారాన్ని గోపీ మోహన్ అందిస్తుండగా, ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం గురువా రం ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను విడుదల చేసింది. ‘హే మాయా సుందరి.. ఎక్కడున్నావో మరి..’ అంటూ హీరో పాడుకునే ఈ పాట సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించగా, గోపీ సుందర్ స్వరాలు సమకూర్చారు.