19-11-2025 12:25:28 AM
కిల్లర్
జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’. పూర్వజ్ దర్శకత్వంలో ఈ సినిమాను పూర్వజ్, పద్మనాభ రెడ్డి ఏ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘ఫైర్ అండ్ ఐస్’ పాటను మంగళవారం లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో కథానాయకి జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ.. “నేను నటిని అయిన తర్వాత మంచి స్టంట్స్‌తో యాక్షన్ సినిమా చేయాలని ఉండేది.
ఆ విషయం పూర్వజ్‌కు చెప్పాను. ఈ ‘కిల్లర్’ స్క్రిప్ట్ సిద్ధం చేశాడు. ఒక కొత్త తరహా కంటెంట్‌తో మీ ముందుకు వస్తున్నాం” అన్నారు. డైరెక్టర్ పూర్వజ్ మాట్లాడుతూ.. “తెలుగు సినిమా కొత్త దారిలో వెళ్తోంది.
ఇలాంటి సమయంలో మేము చేసిన ‘కిల్లర్’ మరో సరికొత్త ప్రయత్నంగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటుంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతుంది. ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఇది” అని చెప్పారు. నిర్మాత పద్మనాభరెడ్డి, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.