04-01-2025 12:00:00 AM
ఆరుగాలం శ్రమించి, కష్టనష్టాలకోర్చి ప్రకృతి బీభత్సాలతో పో రాడి, పంట పండించి ప్రజలందరికీ తిండి పెట్టే రైతన్న జీవితం మాత్రం సానుభూతితో కూడుకున్నది కావడం విషాదకరం . ఎస్సీ, ఎసీ,్ట బీసీ, మైనారిటీలు, పేద వర్గా లు కార్మికులు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వాళ్లకు ఈ దేశంలో ఎలాంటి స్థానం ఉందో రైతులకు కూడా అలాంటి స్థానం ఉండడాన్ని మనమంతా గమనించాలి. పాలకులు ఈ వర్గాల పైన సానుభూతితో పని చేసినట్లు మాట్లాడడం సరైంది కాదు.
రైతులు లేకుంటే రాజకీయరంగంతో సహా ఏ వర్గంకూడా బతికి బట్ట కట్టలేదనేది న గ్నసత్యం. ఈ క్రమంలోనే గతంలో కేంద్ర ప్రభుత్వం రైతు ఆదాయాన్ని రెట్టింపు చే స్తామని అనేక సందర్భాలలో హామీ ఇచ్చి ప్రకటనలు కుమ్మరించినప్పటికీ అత్యల్ప స్థాయిలో ఆర్థిక సహకారం తప్ప పెట్టుబడి సాయం గణనీయంగా పెంచడం కానీ, పె ట్టుబడికి సంబంధించినటువంటి ఖర్చులను భారీగా తగ్గించడం కానీ జరగలేదు.
ఇక అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ రా ష్ట్రంలో కూడా కొన్ని రాయితీలను ప్రకటిస్తే సరిపోదు. స్పష్టమైన హామీలతో పా టు నిర్మాణాత్మకమైన సూచనలను చట్టసభల్లో చర్చించి అమలు చేయడం ద్వారా తమ నిబద్ధతను నిరూపించుకోవాలి.
రైతుపోరాటం అంటే ఈ దేశ సంపదలో తమ వాటా పొందడానికి గల హక్కును సాధించుకోవడమే. సబ్సిడీలు, రాయితీలు ఇవ్వ డం వల్ల పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దళితులు ఆదివాసీలతో పాటు రైతులు కూడా యాచకులుగానే మి గిలిపోతున్నారు. ఇతరవర్గాల దృష్టిలో వీ ళ్లంతా ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. దేశం కోసం పనిచే స్తున్న రైతాంగం పైన యావత్తు ప్రజానీకానికి ముఖ్యం గా పాలకులకు గౌరవభావం ఉండాల్సిన అవసరం చాలా ఉంది.
అమలు చేయాల్సిన సంస్కరణలు
గిట్టుబాటు ధరకు చట్టబద్ధత కల్పించాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని, అప్పుల ఊబిలో కూ రుకు పోకుండా రైతుల రక్షణ బాధ్యత ప్ర భుత్వం తీసుకోవాలని ఢిల్లీ పరిసర ప్రాం తాలలో రైతులు చేస్తున్న డిమాండ్ల పైన ప్రభుత్వం దిగిరాని కారణంగా ఉద్యమం అలాగే కొనసాగుతున్నది.
రెండు సంవత్సరాల క్రితం కూడా రైతులకు ఆటంకంగా మారిన మూడు వ్యవసాయ చట్టాలను అ మలు చేయడానికి పూనుకున్న సందర్భం లో సుమారు 13 మాసాలపాటు ఇదే తరహాలో రైతులు ఉద్యమించి తమ సత్తా చా టడంతో ప్రభుత్వం దిగివచ్చి రైతు చట్టాలను విరమించుకోవడం అందరికీ తెలిసిం దే. స్వేచ్ఛ, స్వతంత్రాలు, సామాజిక న్యా యం ప్రతి పౌరునికి ఎలా అవసరమో, పంటలు పండించి ఉత్పత్తిలో భాగస్వాములయ్యే రైతన్నలు కూడా స్వేచ్ఛగా పండించ డానికి ఎక్కడైనా అమ్ముకోవడానికి, ధర ను నిర్ణయించడానికి అవకాశాలు ఉన్నప్పుడు రైతుల గురించి ఇంత పెద్ద చర్చ చ ట్టసభల లోపల, బయట జరగాల్సిన అవసరం ఉండదు.
ఇతర వృత్తులలాగే రైతు వ్యవసాయం కూడా చక చకాసాగిపోయేది. కానీ ప్రకృతితో, కొన్ని ఇతర శక్తుల తో, అతివృష్టి, అనావృష్టితో సంబంధం ఉన్న వ్యవసాయం ఏదో సందర్భంగా నష్టపోవడం జరుగుతున్నది. అందువల్లనే ని రంతరం రైతులు నష్టాల్లో కూరుకుపోవడం, నష్టాన్ని భర్తీ చేయడానికి అప్పులు తీసుకువచ్చి, అవి కుప్పలుగా పెరిగిపోతుంటే భరించలేని పరిస్థితిలో ఆత్మహత్య లకు పాల్పడడంవంటి బాధాకరమైన స న్నివేశాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి.
2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మూడేళ్లలో రైతుల ఆత్మహత్యలను గమనించినప్పుడు మహారాష్ట్రలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, తెలంగాణలో 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అదే దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో మాత్రం మూడేళ్లలో 300 మంది రైతులుకూడా ఆత్మహత్య చేసుకో లేదంటే అక్కడి రైతాంగ విధానం, ప్రభుత్వ పాలసీనిపరిశీలించవలసిన అవసరం కూడా ఉందని అర్థమవుతుంది.
పంటవేయని భూములకూ..
తెలంగాణ రాష్ట్రంలో 2016 నుండి 2023 వరకు సుమారు 12 సార్లు రైతుబం ధు పేరుతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేసినప్పటికీ నిజమైన రైతులకు కానీ పంట పండించే భూములకు కానీ చెల్లించకుం డా రోడ్డు వేసిన భూములు, అడవులు, గ నుల భూములు, అసైన్డ్ భూముల్లో ఆక్రమించుకున్న వాటికి ఇచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
మొత్తం రూ. 72,816 కోట్లు ఖర్చు చేస్తే అందులో 22,606 కోట్ల రూపాయలు పండించని వృధా భూములకే ఖర్చు చేసినట్టు తెలుస్తుంటే ఇది ఏ రకంగా రాష్ట్రానికి ఉపయో గకరం? ఇలాంటి తప్పుడు విధానాలకు పాల్పడి రైతుల పట్ల సానుభూతిని చూపి తే రైతులు స్వావలంబన దిశగా సాగకపో గా ఎప్పుడు యాచించే వాళ్ళు గానే మిగిలిపోతున్నారు. దాన్ని కట్టడి చేయడంతో పాటుగా, కొంత ప్రక్షాళన చేయడం కూడా కీలకం.
సానుభూతి కాదు సాయం చేయాలి
-- అన్ని రంగాల మాదిరిగా వ్యవసాయదారులు కూడా ఈ జాతి సంపదను, తమ వాటాను అనుభవించడానికి అర్హులు కను క ఆ కోణంలోనే ఆలోచించి నిధులు మం జూరు చేసి వ్యవసారంగాన్ని ప్రోత్సహిస్తేనే తమకు బుక్కెడు మెతుకులు దొరికేది అని తెలుసుకుంటే మంచిది.-- ప్రకృతి పరంగా నష్టపోయినప్పుడు కేవలం సానుభూతి వచనాలు పలకడమే కానీ గతంలో రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చిన దాఖలా లేదు, ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో వరదలు వచ్చి నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు కొంత ప్రయత్నం చేసిన విషయా న్ని గమనించి దేశవ్యాప్తంగా కచ్చితంగా నష్టపరిహారాన్ని చెల్లించాలి.--- పంటలు నష్టపోయినప్పుడు రైతులు నష్టపోకుండా పంటల బీమా పథకాన్ని అమలు చేయాలి పంటల ప్రీమియంను ప్రభుత్వాలే చెల్లించేలా చట్టాలు అమలు జరగాలి.
--సాగుకు యోగ్యమైన భూములను వివిధ పనుల నిమిత్తం ప్రభుత్వాలు సేకరించడం, స్వాధీనపరచుకోవడంకంటే యోగ్యమైన భూ ములలో అవసరమైనటువంటి పంటలు పండించడానికి తగు విధంగా రైతులను ప్రోత్సహించి ఉత్పత్తిలో కీలక పాత్ర పో షించాలి. వ్యవసాయం చేసే ప్రతి క్షేత్రానికి కూడా పెట్టుబడి వస్తువులు, విత్తనాలు, పురుగుమందులు తీసుకుపోవడానికి సరైన రోడ్లను ప్రభుత్వం నిర్మించాలి, మార్కెట్, రవాణా సౌకర్యాలు కల్పించాలి.--ప్రతి పంటకు పంటకాలాలకు అనుగుణం గా అప్పటి ప్రకృతి పరిస్థితులను బట్టి గి ట్టుబాటు ధరను ప్రభుత్వం ప్రకటించడంతోపాటు దానికి చట్టబద్ధతకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేయాలి.
చిన్న నీటి వనరులు, ప్రాజెక్టుల నిర్మా ణ సందర్భంలో రైతుల భూములకు నష్టపరిహారాన్ని తగ్గించడానికి బదులు ఉదా రంగా పరిహారం అందించాలి. పెట్టుబడి సాయం క్షేత్రస్థాయిలో పండించిన భూ ములకు, ఆ రైతులకు మాత్రమే ప్రభు త్వం చెల్లించాలి. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, ఎరువులను ప్రభు త్వం తక్కువ ధరకు సరఫరా చేయాలి.-- క్రమంగా ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించడంతోపాటు సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి రైతాంగాన్ని ప్రోత్సహించాలి.
నిరుపేదలకూ భరోసా కల్పించాలి
రైతులకు రుణమాఫీ,రైతు భరోసా ఇ వ్వడమే కాకుండా పనిముట్లు, యంత్రా లు కొనుక్కోవడానికి సహకరిస్తున్నటువం టి ప్రభుత్వాలు అసలే భూమి లేనటువం టి, రెక్కలను మాత్రమే నమ్ముకుని బతుకుతున్న నిరుపేదలకు కూడా ఈ దేశ సంప దలో తమ వాటాకై డిమాండ్ చేసే హ క్కుందని తెలుసుకుంటే మంచిది. ఉపాధి ని కల్పించడం ద్వారా ప్రజలకు ప్రభుత్వా లు భరోసాను ఇవ్వాలి.
అది చట్టబద్ధంగా చెల్లించాలి కానీ సానుభూతితో మాత్రం కాదు. నిజానికి ఈ దేశంలో ఎవరికీ ప్రభు త్వాలు సానుభూతితో నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ పేద వర్గాలకు అం దితేనే సమానత్వాన్ని తీసుకురావడానికి, అంతరాలు లేని వ్యవస్థను ఆవిష్కరించడానికి పునాది పడ్డట్టు లెక్క. రుణమాఫీ, రైతు భరోసావంటి సహకారాలను చెల్లించడానికి కొన్ని నిబంధనలను రూపొందించి వాటిని కట్టుదిట్టంగా అమలు చేయాలి.