calender_icon.png 14 September, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీతేజ్‌ను కలవాలని ఉంది

16-12-2024 01:19:57 AM

కేసు విచారణ వల్ల కుదరడం లేదు: అల్లు అర్జున్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యంపై అల్లు అర్జున్ స్పందించారు. శ్రీతేజ్, అతడి కుటుంబాన్ని కలవాలని ఉందని, కానీ కేసు విచారణ కొనసాగుతుండడంతో కలవలేకపోతున్నానని తెలిపారు. బాధిత కుటుంబా న్ని ఆదుకుంటాననే మాటకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. త్వరలోనే శ్రీతేజ్ కుటుంబాన్ని కలుస్తానని చెప్పారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఆదివారం సాయంత్రం ఎక్స్ వేదికగా ఈ పోస్టు పెట్టారు.