11-02-2025 12:00:00 AM
అందోలు, ఫిబ్రవరి 10 : ఈ ప్రాంతంలో వర్తక వ్యాపారంగంలో ఎంతో చరిత్ర కలిగి ఉందని, ప్రస్తుతం వ్యాపార రంగంలో జోగిపేట వెనుకంజలో ఉందని ఏడోదిలోగా జోగిపేటకు పూర్వ వైభవం తెస్తానని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు.
సోమవారం అందోలు, జోగిపేట మున్సి పాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహ పున ప్రతిష్ట దేవస్థానం ప్రారంభోత్సవంలో స్థానిక పురాతన దేవాలయం శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ రామచంద్ర ఆలయాని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ దర్శించు కున్నారు. ఈ దేవాలయలలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొ న్నారు.
భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ చిలిపి చెడు, హత్నూర మండలాలలోని 8 గ్రామ పంచాయతీల ప్రజలకు జోగిపేటకు సత్సంబంధాలు కలిపేందుకు మంజీరా నదిపై బ్రిడ్జి నిర్మాణం త్వరలో ప్రారంభం కాబోతుంది న్నారు .
ఈ బ్రిడ్జి ద్వారా ఈ ప్రాంతంలో రాకపోకలు కొనసాగుతాయని, ఫలితంగా జోగిపేట వర్తక వ్యాపార రంగం లో అభివృద్ధి పథంలో పయనిస్తుం దన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరు పండుగలు జరుపుకోవాలని ఆలయాల పునరుద్ధరణ జరుగుతోం దన్నారు. ఆలయాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. ఆలయాల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ సంధర్భంగా దేవాలయలలో ఏర్పాటు చేసిన పూజ కార్యక్రమాల్లో భాగంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, మాజీ వార్డు కౌన్సిలర్ కోరబోయిన నాగరాజు (నాని ) మంత్రికి ఆలయ ప్రాంగణాల్లో శాలువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతి మాట్లాడుతూ సనాతన ధర్మం చాలా పవిత్రమైందని ధార్మిక కార్యక్రమాల్లో భక్తిశ్రద్ధతో భక్తులు పాల్గొనాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.