11-02-2025 12:00:00 AM
సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి
కొండపాక, ఫిబ్రవరి 10 : జిల్లాలో జరుగుతున్న నేషనల్ హైవే పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ హైవే, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్ లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. మెదక్ ఎల్కతుర్తి నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా హుస్నాబాద్ టౌన్ లో వాటర్ పైప్ లైన్, సెంట్రల్ లైటింగ్ జంక్షన్ పనులు ప్రారంభించాలని తెలిపారు.
పందిళ్ల బ్రిడ్జి నిర్మాణంలో వేగం పెంచి వారంలో పూర్తి చేయాలన్నారు. పందిళ్ళ - కూచన్ పల్లి టోల్గేట్ నిర్మాణానికి కావలసిన భూసేకరణ రెవెన్యూ అధికారుల సహకారంతో పూర్తి చేయాలని గ్రావెల్ ఫిల్లింగ్, ఇతర శాఖల నుండి అన్ని అనుమతులు తీసుకొని, రోడ్డు వెంబడి దేవాలయాలు ఉన్నందున పనులు ఆగడం వలన అక్కడి స్థానిక ప్రజలతో చర్చించి ప్రొసీజర్ ప్రకారం షిఫ్ట్ చేసి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాoమ్మూర్తి, హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నేషనల్ హైవే ఏఈలు అనురాగ్ శ్రీనివాస్ రావు, కాంట్రాక్టర్ నేమి చందు తదితరులు పాల్గొన్నారు.