30-12-2025 01:37:58 AM
టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి, డిసెంబర్ 29 :ధూప దీప నైవేద్య అర్చక సంఘం తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి మెదక్ జిల్లా ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో అర్చక సమస్యలపై అర్చక చైతన్య యాత్ర చేయడం జరిగింది.
ఇందులో భాగంగా సంగారెడ్డి అధ్యక్షులు మడుపతి అడ్వయ్య స్వామి, మెదక్ జిల్లా అధ్యక్షులు శలాక రాజేశ్వర్ శర్మ, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు చాడనంద బాల శర్మ, కార్యదర్శులు, శ్యామ్ సుందర్ శర్మ, వీరభద్రయ్య స్వామి, చిదిరే రాజశేఖర్ శర్మ, కోశాధికారులు ఎం.శంభు ప్రసాద్ స్వామి, ప్రవీణ్ శర్మ, రాజ మనోహర్ శర్మ. మహేష్ స్వామి, రాష్ట్ర బాధ్యులు, నియోజకవర్గ కన్వీనర్లు, మండల కన్వీనర్లు మూడు జిల్లాల అ ర్చకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు. వారికి అర్చక సంఘం తరఫున అర్చక సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో ఉద్యోగ భద్రత, కనీస వేతనం, ప్రభుత్వ పథకాలలో చోటు, ఇందిరమ్మ ఇల్లు తదితర విషయాలు అడగడం జరిగింది. అర్చకులు ర్యాలీగా వెళ్లి దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కు అర్చక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ అర్చక సమస్యలు కచ్చితంగా తీరుస్తామని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీనిచ్చారు.