30-12-2025 01:40:17 AM
సిద్దిపేట క్రైం, డిసెంబర్ 29 : డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 27 మందికి సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు రూ.2లక్షల 74 వేలు జరిమానా విధించారని సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్‌కె.ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలోని పలు చౌరస్తాలు, రాజీవ్ రహదారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా, 27 మంది మద్యం తాగివాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని చెప్పారు.
సోమవారం వారిని న్యాయమూర్తిఎదుట హాజరుపరచగా, విచారణ చేసి జరిమానా విధించారని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నిత్యం డ్రంక్ అండ్‌డ్రైవ్ టెస్ట్ నిర్వహిస్తామని ఇన్స్పెక్టర్‌కె.ప్రవీణ్ కుమార్ తెలిపారు.