calender_icon.png 9 November, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరికొత్తగా సైక్ సిద్ధార్థ

09-11-2025 12:06:38 AM

యువ హీరో శ్రీనందు నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘సైక్ సిద్ధార్థ’. ఈ చిత్రానికి వరుణ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీనందు, శ్యామ్‌సుందర్‌రెడ్డి తుడి సంయు క్తంగా నిర్మించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు.

కే ప్రకాశ్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా, స్మరణ్ సాయి సంగీత దర్శకుడిగా, ప్రతీక్ నూతి ఎడిటర్‌గా పనిచేశారు. ఈ సినిమా డిసెంబర్ 12న ఏషియన్ సురేశ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈవెంట్‌లో కథానాయకుడు శ్రీనందు మాట్లాడుతూ.. “ఈ సినిమా, ఈవెంట్ మాకు చాలా స్పెషల్.

టీజర్ కట్ కొత్తగా ఉండాలని ప్రయత్నంతో చేశాం. ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ అంతా కథకు తగ్గట్టుగానే ఉంటుంది. ఈ సినిమా మేకింగ్ గ్రామర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. అన్నీ నేచురల్ లొకేషన్లలో షూట్ చేశాం. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలో చూడని ఒక కొత్త కోణం కనిపిస్తుంది” అన్నారు. ‘ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. షూటింగ్ చాలా ఫన్‌గా అనిపించింది.

ప్రేక్షకులు కూడా అదే ఫన్ ఫీల్ అవుతార’ని కథానాయిక యామిని తెలిపారు. డైరెక్టర్ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. “చాలా కొత్తగా అనిపించే సినిమా ఇది. ఈ టైటిల్ కథకు పర్ఫెక్ట్ యాప్ట్. నందు చాలా అద్భుతమైన పెర్ఫార్మర్. ఈ సినిమాతో తనలోని ఒక కొత్త యాంగిల్ చూస్తారు” అని చెప్పారు.