calender_icon.png 31 December, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత్రికేయలకు న్యాయం జరిగేలా చూస్తా

31-12-2025 12:43:39 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, డిసెంబర్ 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ పాత్రికేయులు చేస్తున్న మంగళవారం నాటికి 8 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్మల్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్‌ను కలిసి నిర్మల్ జిల్లా కేంద్రంలో పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విన తి పత్రం అందించారు.

ఇళ్ల స్థలాల కేటాయిం పు విషయంలో కలెక్టర్ ప్రభుత్వ పాలసీని వివరించి తప్పకుండా తన వంతు సహకారం అందించేందుకు కృషి చేస్తారని ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చే పాత్రికేయు లు అంటే తమకు ఎంతో గౌరవం అని పేర్కొన్నారు. త్వరలోనే జిల్లాలో కమిటీని ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్చించడం జరుగుతుందని పాత్రికేయులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపిఆర్‌ఓ విష్ణువర్ధన్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీధర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు