27-12-2025 02:44:24 AM
ముషీరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): కన్నుమూసే దాకా పెన్నుమూసేదే లే..పెన్ను మూసేదాకా కన్నుమూసేదే లే.. అని ప్రముఖ కవి, రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. పుస్తకం కేవలం జ్ఞానాన్నే కాదు.. మృత్యువు అంచున ఉన్న మనిషికి ప్రాణం కూడా పోస్తుందని ప్రముఖ ప్రజాకవి జయరాజు చెప్పారు. 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో భాగంగా అనిశెట్టి రజిత వేదికపై శుక్రవారం సాయంత్రం ‘పుస్తక స్ఫూర్తి, పుస్తకం ఒక దారిదీపం’ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ చర్చాగోష్ఠికి హైదరా బాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూ బ్ సభను ప్రారంభించగా, సమన్వయ కర్తలుగా ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, పేర్ల రాము లు వ్యవహరించారు. ఈ సందర్భంగా సు ద్దాల అశోక్‌తేజ, జయరాజు మాట్లాడారు.
‘కన్ను మూసేదాకా పెన్ను మూసేదే లే.. పెన్ను మూసేదాకా కన్ను మూసేదే లే’ అంటూ ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. నేల మ్మా నేలమ్మా...’ అనే గీతంతో సభికులను ఉర్రూతలూగించిన ఆయన, మనిషిని బతికించే సంజీవని పుస్తకమేనని స్పష్టం చేశారు. ప్రజాకవి జయరాజు మాట్లాడుతూ పుస్తకం కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాదు, మృత్యు వు అంచున ఉన్న మనిషికి ప్రాణా న్ని కూడా పోస్తుందన్నారు. బుక్ ఫెయిర్ అధ్యక్షుడు ప్రముఖ కవి యాకూబ్ మాట్లాడారు. మంచి పుస్తకం మనిషి జీవితం లోకి ప్రవేశిస్తే అది ఆలోచనలను మేల్కొలిపి అద్భుత మైన ప్రతిభగా మారుతుందని అన్నారు.
‘తెలంగాణ గిరిజన క్షేత్రాలు-జాతర’ పుస్తకావిష్కరణ
హైదరాబాద్ బుక్ ఫెయిర్ సందర్భంగా కొంపల్లివెంకట్‌గౌడ్ వేదికపై ‘తెలంగాణ గిరిజన క్షేత్రాలు- జాతర’ పుస్తకాన్ని సేడం అర్జు మాస్టర్ శుక్రవారం ఘనంగా ఆవిష్కరించారు. సభాధ్యక్షుడిగా దక్కన్ ల్యాండ్ పత్రిక సంపాదకులు వేదకుమార్ తెలంగాణ గిరిజ న క్షేత్రాలను చక్కని ఉదాహరణలతో పరిచ యం చేశారు. కార్యక్రమంలో పుస్తక రచయిత డా.ధ్యావనపల్లి సత్యనారాయణ నిజాం కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆప్కా నాగేశ్వరరావు బాలాచారి పాల్గొన్నారు.