07-05-2025 01:04:16 AM
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గోపాలపేట మే 6 : ఎల్లప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. మంగళవారం గోపాలపేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కార్యకర్త అడ్డాకులరవీందర్ ఇటీవల ప్రమాదానికి గురై మరణించారు.నిరంజన్ రెడ్డి వారి కుటుంబానికి మాట ఇచ్చిన ప్రకారం పార్టీ భీమా చెక్ వారి సతీమణి అడ్డాకుల అంజలికి తాడిపర్తిలోని వారి ఇంటికి వెళ్లి అందించి మనోధైర్యాన్ని నింపారు.
ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నాయకులకు, కార్యకర్తలకు ఆపద వస్తే అండగా ఉంటానని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.కార్యకర్తల సంక్షేమం కోసం కేసీఆర్ జీవిత భీమా కల్పించారని గతములో రైతు భీమా ద్వారా మరణించిన రైతు కుటుంబాలకు 5 రోజులలో 5 లక్షల రూపాయలు అందించిన ఘనత,కళ్యాణ లక్ష్మితో పేదింటి ఆడపిల్లలకు అందించిన ఘనత కేసీఆర్ కిట్టు ద్వారా బాలింతలకు 13000 వేల రూపాయలు అందించిన ఘనత ఈ దేశ చరిత్రలో కేసీఆర్ ది అని కొనియాడారు.
అన్నింటి కంటే పేద కార్యకర్తలకు ప్రమాదం జరిగి చనిపోతే 2 లక్షల భీమా ఇచ్చి కేసీఆర్ ఆదుకున్నారని అన్నారు.నియోజకవర్గంలో నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు 24 గంటలు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.నిరంజన్ రెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వెంట గట్టు యాదవ్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్,మాజీ ఎంపీపి సంధ్య తిరుపతయ్య, పెబ్బేరు మాజీ జడ్పీటీసీ వెంకటేష్ , మణ్యం నాయక్, చంద్రశేఖర్, కృష్ణయ్య, శంకరయ్య, మో హన్, రాములు, వెంకటేష్ ,రమేష్,చిట్యాలరాము,నాగరాజు,శివలక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.