07-05-2025 01:05:12 AM
వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం మే 6 (విజయక్రాంతి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు నిర్వహిస్తున్న ఆదివాసి ప్రజల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఆపరేషన్ చేయుతా కార్యక్రమం ద్వారా మావోయిస్టులు పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. ఏ క్రమంలోనే మంగళవారం నిషేధిత సిపిఐ ఎంఎల్ మావోయిస్టు పార్టీకి చెందిన 14 మంది మావోయిస్టులు ఎస్పీ రోహిత్ రాజు ఎదుట లొంగిపోయారు.
లొంగిపోయిన మావోయిస్టు వివరాలను ఎస్పీ రోహిత్ రాజ్ విలేకరులకు వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు అందిస్తున్న పునరావాస సౌకర్యాలకు ఆకర్షితులై వివిధ క్యాడర్లో ఉన్న వారంతా తమ ఆయుధాలను విడిచిపెట్టి జనజీవన శ్రవంతిలో కలుస్తున్నారని ఎస్పీ వివరించా రు. లొంగిపోయిన వారిలో ముగ్గురు మహిళా దళ సభ్యులు ఉన్నారని తెలిపారు.
లొంగిపోయిన వారంతా ఏరియా కమిటీ సభ్యులు, పార్టీ సభ్యులు, మీలిషియా సభ్యులు ఉన్నారన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 227 మంది మావోయిస్టులు కొత్తగూడెం పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు తెలిపారు. లొంగిపోయిన మావోయి సభ్యులకు పునరావాసం, జీవనోపాధి కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ కృషి చేస్తున్న అన్నారు.