09-01-2026 08:30:42 PM
మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ పరిధిలో 1 వార్డులోని శ్రీపాద కాలనీ లోని శ్రీపాద కాలనీ 11 టీంనకు శుక్రవారం మాజీ వార్డు సభ్యులు ఆకుల కవిత శ్రీనివాస్ ఆధ్వర్యములో శుక్రవారం టీషర్టు లు పంపిణీ చేశారు. శ్రీపాద కాలనీ 11 టీం ఆధ్వర్యములో శ్రీపాద కాలనీ మెగా టోర్నమెంట్ నీ నెల 8వ తేదీన నిర్వాహకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా 11టీం క్రీడా కారులు అయిన 24 మంది యువకులకు జెర్సీ టీషర్టు లు పంపిణీ చేశారు. అదే విధంగా టోర్నమెంట్ కి అవసరం అయినటువంటి స్టేజ్ సౌండ్ సిస్టమ్ మరి కొన్ని సదుపాయాలు సమకూర్చారు.