calender_icon.png 24 September, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగుసార్లు చనిపోయి ఉండేవాన్ని

24-09-2025 12:48:38 AM

రిషబ్ శెట్టి  భారీ ప్రాజెక్ట్ ‘కాంతార: చాప్టర్ 1’. రిషబ్ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రూపొందుతోంది. ఈ సినిమాను హోంబాలే ఫిల్మ్స్ నిర్మిస్తుండగా రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. అక్టోబర్ 2 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై వస్తున్న రూమర్స్‌పై రిషబ్ స్పం దించారు. “నో స్మోకింగ్, నో ఆల్కహాల్, నో మీట్ అనే పోస్టర్ చూసి నేను షాక్ అయ్యాను.

అది ఎవరో ఉద్దేశపూర్వకంగానే సృష్టించిన ఫేక్ పోస్టర్ అని తేలింది” అని తెలిపారు.  రిషబ్ షూటింగ్ విశేషాలు పంచుకున్నారు. ‘ఈ సినిమా కోసం టీమ్ అంతా సొంత సినిమాలాగా భావించి విశ్రాంతి లేకుండా శ్రమించారు. నాకు నాలుగు సార్లు ప్రమాదం జరిగింది. అప్పుడే నేను చనిపోయి ఉండేవాడ్ని. ఆ దేవుడి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఈ సినిమా పూర్తయింది” అని తెలిపారు.