calender_icon.png 24 September, 2025 | 2:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కౌగిలై ఖాళీ నింపుదామా..

24-09-2025 12:49:59 AM

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తాజా మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘తెలుసు కదా’. ప్రముఖ స్టులిస్ట్ నీరజ కోన ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. పీపుల్‌మీడియాఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో సిద్దూకు జోడీగా రాశీ ఖన్నా, శ్రీనిధిశెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘మల్లిక గంధ..’ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

సిద్దూ, రాశీ ఖన్నా కలిసి అలరించిన క్లాసిక్ లవ్ నంబర్ ఇది. తాజాగా సెకండ్ సింగిల్ ‘సొగసు చూడతరమా..’ను హీరోయిన్ నయనతార లాంచ్ చేశారు. సిద్దు, శ్రీనిధిశెట్టిలపై చిత్రీకరించిన గీతమిది. సొగసు చూడతరమా.. చాలదే సమయమాపగలమా.. ప్రేమతో సులువు కాదులేమా..

కౌగిలై ఖాళీ నింపుదామా..’ అంటూ సాగుతున్న ఈ పాటలో సిద్ధు, శ్రీనిధి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. తమన్ స్వరపరిచిన ఈ గీతానికి  కృష్ణకాంత్ సాహిత్యం అందించగా, కార్తీక్ ఆలపించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి డీవోపీ: జ్ఞానశేఖర్ వీఎస్; ఎడిటర్: నవీన్ నూలి.