calender_icon.png 19 November, 2025 | 3:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబొమ్మ రవిని ఎన్‌కౌంటర్ చేయాలి

19-11-2025 12:23:50 AM

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహ కుడు ఇమ్మడి రవిని ఎన్‌కౌంటర్ చేయా లంటూ నిర్మాత సీ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రవి అరెస్ట్ నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ చాంబర్‌లో నిర్మాతలు మంగళవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా సీ కల్యాణ్ మాట్లాడుతూ.. “నేను తెలుగు ఫిల్మ్ చాంబర్ సెక్రటరీగా ఉన్నప్పుడే యాంటీ వీడియో పైరసీ సెల్ ఏర్పాటు చేశాం. కొందరు విశ్రాంత పోలీసు అధికారులు అందులో భాగమయ్యారు.

హాలీవుడ్ సినిమాల పైరసీని అరికట్టాం. తెలుగు ఫిల్మ్ చాంబర్ కృషిని స్కాట్లాండ్ పోలీసులు గుర్తించి, ప్రశంసించారు. కొంతకాలం ఫండ్ కూడా పంపించారు. దేశంలో యాంటీ వీడియో పైరసీ సెల్‌ను నిర్వహిస్తోంది తెలుగు ఫిల్మ్ చాంబర్ ఒక్కటే. ఎంతగానో శ్రమించి ఐబొమ్మ రవిని పట్టుకున్న తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ధన్యవాదాలు. రాష్ర్ట ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం కలిసి సినీ పరిశ్రమకు అండగా నిలబడాలి.

ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవిని ఎన్‌కౌంటర్ చేయాలి. కడుపు మంటతో, బాధతో మాట్లాడుతున్నా. ఒకవేళ అదే జరిగితే ఇలాంటి పనులు చేయాలంటే మరొకరు భయపడతారు” అన్నారు. వల్లభనేని అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. “సిని మాలు ప్రస్తుతం విజయం సాధించ లేకపోవడానికి ముఖ్య కారణం పైరసీ. తెలంగాణ ప్రభుత్వం పైరసీని అరికట్టడం చాలెంజ్‌గా తీసుకుని పైరసీ చేసేవారిని పట్టుకోవడం సినీ పరిశ్రమకు వరం.

పైరసీని పూర్తిగా అరికడి తేనే కొత్త నిర్మాతలు ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు చేస్తారు. కుటుంబంతో సహా థియేటర్‌కు వచ్చేలా టికెట్ ధరలు ఉండేలా చూడాలి” అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో భరత్ భూషణ్, వీరశంకర్, చదలవాడ శ్రీనివాసరావు, ముత్యాల రామప్రసాద్, ప్రసన్నకుమార్, అమ్మి రాజు, బాపిరాజు తదితరులు మాట్లాడారు.