19-11-2025 12:22:10 AM
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రం ‘అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ రెండో గీతాన్ని రిలీజ్ చేశారు. ‘జాజికాయ’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ లిరిసిస్ట్ కాసర్ల శ్యామ్ లిరిక్స్‌తో రాయగా.. శ్రేయాఘోషల్, బ్రిజేష్ శాండిల్యా పాడారు. తమన్ స్వరాలు సమకూర్చారు.
వైజాగ్‌లో జరిగిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ..“ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. అఖండ మన దగ్గర ఎంత పెద్ద హిట్ అయిందో చూశారు. ఇప్పుడు సీక్వెల్ ‘అఖండ: తాండవం’ పాన్ ఇండియా రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ కాబోతోంది. ఇది కేవలం తెలుగు సినిమా కాదు. మన భారతీయ సనాతన హైందవ ధర్మం శక్తి, పరాక్రమాన్ని చాటిచెప్పే చిత్రం. మన జాతి మూలాలు ఏంటో తెలియజేసే సినిమా.
అందుకే అన్ని భాషల్లో సినిమాను ప్రమోట్ చేస్తున్నాం. మొన్న ముంబైలో మన దెబ్బకు హిందీవాళ్లకు దిమ్మతిరిగిపోయింది” అని చెప్పారు. ‘నాకు ఊపిరున్నంత వరకు బాలయ్యబాబుకు ఓపిక ఉన్నంత వరకు మా కాంబినేషన్ రిపీట్ అవుతూనే ఉంటుంద’ని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. హీరోయిన్ సంయక్త మాట్లాడుతూ.. “నా పాత్ర చాలా సస్పెన్స్‌గా ఉంటుంది.
అందుకే నేను ఎక్కువ రివీల్ చేయడం లేదు. బాలయ్య బాబు ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించేలా ఈ పాట ఉంటుంది. ఇది నా ఫస్ట్ స్పెషల్ సాంగ్” అన్నారు. నిర్మాత గోపి మాట్లాడుతూ.. “మంచి హైఓల్టేజ్ ఎనర్జీ ఉన్న ఫాస్ట్ బీట్ సాంగ్ ఇది. సినిమాలో ఈ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ మొత్తం నాలుగు నిమిషాలు ఉర్రూతలూగిపోతుంది. ముఖ్యంగా లాస్ట్ 45 సెకెన్స్ అయితే బాలయ్య బాబు ఫ్యాన్స్‌కు పండగే” అన్నారు.